రెపో రేటులో మార్పులు లేవు?

ఆగస్ట్​ 6 నుంచి 8 వరకు ఎంపీసీ సమావేశం అనంతరమే ఆర్బీఐ గవర్నర్​ ప్రకటన 6.5 వద్దే కొనసాగించనున్న ఆర్బీఐ?

Aug 4, 2024 - 18:43
 0
రెపో రేటులో మార్పులు లేవు?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 2024–25 రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రెపో రేటుపై ఆగస్ట్​ 8న ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఆర్థిక నిపులతో ఎంపీసీ (ద్రవ్య విధాన కమిటీ) సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం రెపో రేటుపై స్పష్టత ఇవ్వనున్నారు.

రెపోరేటును 6.5 వద్దే ఆర్బీఐ కొనసాగించే అవకాశం ఉంది. రానున్న నెలల్లో ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశం ఉంది. వడ్డీ రేట్లపై తన వైఖరిని మార్చుకునే ముందు ఆర్బీఐ అమెరికా ద్రవ్య విధానాన్ని నిశితంగా పరిశీలించనుంది. ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి స్థిరంగానే ఉన్నా ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ కూడా రేటును తగ్గించే అవకాశం లేదు.

కాగా ఎంపీసీ సమావేశం ఆగస్ట్​ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. ద్రవ్యోల్బణం రేటు 5.1 అధిక స్థాయిలోనే ఉన్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది రాబోయే కాలంలో సంఖ్యాపరంగా తగ్గే అవకాశం ఉందన్నారు.