రికార్డులకు చేరువవుతున్న నిర్మలమ్మ
Nirmalamma approaching records
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎనిమిదోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డుల పరంపరలను కొనసాగించనున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మదే రికార్డు. 2020న మంత్రి రెండు గంటల 40 నిమిషాల సుధీర్ఘ ప్రసంగాన్ని అలవోకగా చదివి వినిపించారు. అత్యంత తక్కువ బడ్జెట్ ప్రసంగం 1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేశారు. ఈయన ప్రసంగంలో కేవలం 800 పదాలు ఉండడం గమనార్హం. అత్యధిక బడ్జెట్ లు సమర్పించిన రికార్డులో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఆయన 1959 –1964 వరకు ఆరు, 1967 –1969 వరకు నాలుగు బడ్జెట్ లు ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరం తొమ్మిదిసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రణభ్ ముఖర్జీ ఎనిమిదిసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారిలో ఉన్నారు. పీవీ నరసింహారావు ఐదుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2017 నుంచి బడ్జెట్ సమర్పించే తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు.