నందమూరి బాలకృష్ణకు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అభినందనలు

Union Minister Kishan Reddy congratulated Nandamuri Balakrishna

Jan 26, 2025 - 17:37
Jan 26, 2025 - 17:37
 0
నందమూరి బాలకృష్ణకు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అభినందనలు

నా తెలంగాణ, హైదరాబాద్​: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవలు ఎనలేనివని, ఆయనను పద్మభూషణ్​ కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. పద్మభూషణ్​ ప్రకటించిన సందర్భంగా ఆదివారం కేంద్రమంత్రి నందమూరి బాలకృష్ణను కలిసి  పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. సినిమాల్లోనే గాక ప్రజాసేవలోనూ బాలకృష్ణ సేవలను కొనియాడారు. ఆయనకు ఈ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన భేటీలో పలు అంశాలను చర్చించుకున్నారు.