స్పీకర్ కు వక్ఫ్ సవరణ బిల్లు
Waqf Amendment Bill to the Speaker
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) చైర్మన్ జగదాంబికా పాల్ అందజేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులతో వాదనలు, సవరణలు 655 పేజీలతో కూడిన నివేదికను అందించారు. నివేదికలోని అన్ని అంశాలను కూలంకషంగా పొందుపరిచారు. కాగా ఈ సవరణపై గత ఆరు నెలలుగా జేపీసీ అన్ని పక్షాలతో చర్చలు, తర్జనభర్జనల అనంతరం ఓటింగ్ నిర్వహించి ఆమోదించింది. అధికార సభ్యులు ఈ సవరణల బిల్లుతో మేలు జరుగుతుందని అంటుండగా, విపక్షాలు మాత్రం కీడే జరుగుతుందని ఆరోపిస్తున్నాయి.