మలావితో బంధాలు మరింత బలోపేతం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ
లిలాంగ్వే: మలావికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దౌత్యసంబంధాలను ఏర్పర్చుకున్న తొలి దేశం భారత్ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. గురువారం మలావి పర్యటనలో ఉన్న ముర్మూ సాయంత్రం రాజధాని లిలాంగ్వేలో ఇండియా మలావి బిజినెస్ మీట్ లో ప్రసంగించారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు అత్యంత ధృఢంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ మలావికి అతిపెద్ద నాలుగో వాణిజ్య భాగస్వామిగా ఉందని వివరించారు. మలావిలో అతిపెద్ద పెట్టుబడిదారులలో భారత్ ఒకటని తెలిపారు. ఇరుదేశాలు అనేక రంగాలలో పరస్పర సహకారంతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ముర్మూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు వ్యాపార వర్గాలతోపాటు, ప్రజలు కూడా సహకరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ కోరారు.