ఆస్తి పన్ను వసూల్లో అధికారుల నిర్లక్ష్యం 

ట్రోల్ అవుతున్న రూ.534ల బిల్లు

Jun 15, 2024 - 20:09
Jun 15, 2024 - 20:11
 0
ఆస్తి పన్ను వసూల్లో అధికారుల నిర్లక్ష్యం 

నా తెలంగాణ,చెన్నూర్: మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తి, నీరు, చెత్త సేవ పన్నుల ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం వహించవద్దని చెబుతున్న అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారని మరోమారు రుజువైంది. వివరాల్లోకి వెళితే చెన్నూర్ పట్టణంలో ఉన్న అతి పెద్ద షాపింగ్ మాల్ కు పుర అధికారులు 2024-25 సంవత్సరానికి గాను కేవలం రూ.534 వసూలు చేసిన బిల్లు ప్రస్తుతం పలు వాట్సాఫ్ ఇతర మాధ్యమాల్లో ట్రోల్ అవుతోంది.

ఆ షాపింగ్ మాల్ చెన్నూర్ చైర్మన్ తనయుడికి చెందినట్లు తెలుస్తుంది. ప్రజాప్రతినిధుల బంధువులైతే వేల బిల్లును వందల్లోకి తారుమారు చేస్తారా? అంటూ పలువురు రాజకీయ నాయకులు తలంటుతున్నారు. పన్నుల వసూళ్లల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.