అలకనందా ప్రమాదం.. 12 మంది మృతి
ఏడుగురి పరిస్థితి విషమం కాపాడేందుకు వెళ్లిన కార్మికుడు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని బ్రదీనాథ్ హైవేపై శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. 660 అడుగుల లోతులో ట్రావెలర్ బస్సు అలకానంద నదీలో పడింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఏయిర్ లిఫ్ట్ ద్వారా రిషికేష్ లోని ఏయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
బస్సులో 26 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఢిల్లీ నుంచి బద్రీనాథ్ యాత్రకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
టెంపూ రుద్రప్రయాగ్ జిల్లా సమీపంలోకి రాగానే మూలమలుపు వద్ద అదుపుతప్పి అలకనంద నదీలో బోల్తా కొట్టింది. కాగా ప్రమాదానికి దగ్గరలోనే రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ప్రమాదాన్ని చూసిన ముగ్గురు కార్మికులు వారిని కాపాడేందుకు నదిలోకి దిగారు. వీరిలో ఇద్దరు సురక్షితంగా బయటకు రాగా ఒక కార్మికుడు మృతిచెందాడు.