67వ పడిలోకి ఆసియా టాప్ మోస్ట్ బిలియనీర్ ముఖేష్ అంబానీ
ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బిలియనీర్లలో 11వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ 67వ యేట అడుగు పెట్టారు.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బిలియనీర్లలో 11వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ 67వ యేట అడుగు పెట్టారు. 1957 ఏప్రిల్ 19న ముఖేష్ అంబానీ జన్మించారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ తండ్రి మరణానంతరం సామర్థ్యం, కృషితో తనకు దక్కిన అవకాశాలను వినియోగించి ఇంతింతై వటుడింతగా వ్యాపార సామ్రాజ్యంలో ఎదిగారు. నేడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరు,ప్రఖ్యాతులు సాధించుకోగలిగారు.
రిలయన్స్ పగ్గాలు చేపట్టి ఉన్నత శిఖరాలకు చేరారు. ప్రస్తుతం రియలన్స్ క్యాపిటల్ మార్కెట్ విలువ రూ. 19.79 లక్షల కోట్లు కావడం విశేషం. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ సంపద 112 బిలియన్ డాలర్లు.