శ్రీశైలంలో అపచారం నందీ విగ్రహం వద్ద మటన్ బిర్యానీ
Mutton biryani at Apacharam Nandi statue in Srisailam
ముస్లిం మహిళల దుస్సాహసంపై హిందువుల ఆగ్రహం
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
శ్రీశైలం: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అపచారం చోటు చేసుకుంది. ముస్లిం మహిళలు వినాయకుడు, నందీ విగ్రహం ఉన్న ఆలయానికి సమీపంలోని పార్కులో మటన్ బిర్యానీని ఆరగిస్తుండగా పలువురు భక్తులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. పవిత్ర పుణ్య క్షేత్రంలో ఇలాంటి చోట జంతువుల కూరను తింటూ హిందూత్వాన్ని అపహాస్యం చేస్తున్నారా? అని ఆ మహిళలను నిలదీశారు. తమ పుణ్యక్షేత్రాలతో బాటు ఇతరుల పుణ్యక్షేత్రాలను కూడా గౌరవించాలన్నది తెలియదా? అని ప్రశ్నించారు. ఈ ఘటన ఆగస్ట్ 10న జరిగినట్లుగా తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో శనివారం వెలుగులోకొచ్చింది. అందులో శ్రీశైలం ఆలయ పరిధిలోని పార్కులో ఉన్న నంది విగ్రహం వద్ద వీరు మటన్ బిర్యానిని తింటున్న చిత్రాలు, వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు చిత్రాలపై హిందూ వర్గాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.