ఏకైక సిద్ధాంతం శాంతియుత పరిష్కారమే

The only theory is a peaceful solution

Oct 22, 2024 - 22:00
 0
ఏకైక సిద్ధాంతం శాంతియుత పరిష్కారమే
ఇరాన్​ కు స్పష్టం చేసిన ప్రధాని మోదీ
అధ్యక్షుడు మసూద్​ తో భేటీ
మాస్కో: శాంతియుత పరిష్​కారమే భారత్​ ఏకైక సిద్ధాంతమని, అదే సమయంలో ప్రపంచదేశాలకు ఉగ్రవాదం పెనుభూతమని ఇరాన్​ భారత ప్రధానమంత్రి ఇరాన్​ అధ్యక్షుడు మసూద్​ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్​టం చేశారు. ఇరాన్​–గాజా(హమాస్​)– లెబనాన్​ (హిజ్బుల్లా)లపై ఇజ్రాయెల్​ దాడులపై ప్రధాని మోదీ మసూద్​ తో ప్రధానంగా చర్చించారు. ఇజ్రాయెల్​–ఇరాన్​ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే మార్గాలకు ప్రధానంగా శాంతిద్వారానే సమాధానం లభిస్తుందన్నారు. ఇజ్రాయెల్​ బందీల విడుదలతో శాంతికి పూర్తి మార్గాలు తెరుచుకోగలవని అన్నారు? దీంతో ఇరుదేశాల్లో ఉద్రిక్తతలు సద్దుమణిగి పూర్వ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయన్నారు. ఇజ్రాయెల్–ఇరాన్​ లతో కూడా తమది వ్యూహాత్మక బంధం అయినప్పటికీ ఇరుదేశాలలో మానవాళిపై ప్రమాదపు ఘంటికలు మోగించడం భారత్​ కు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్ధలు కొట్టారు. ఇరాన్​ – భారత్​ ల బంధం ఈనాటిది కాదన్నారు. ఇరుదేశాల ఆర్థిక స్వావలంభన, ద్వైపాక్షికంగా మేలు చేసే పలు అంశాలపై కూడా చర్చించారు. మరోవైపు ఇజ్రాయెల్​ ఇరాన్​ అణు స్థావరాలు, పెట్రోలియం సంస్థలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందన్న నేపథ్యంలో మోదీ ఇరాన్​ అధ్యక్షుడు మసూద్​ తో భేటీపై ప్రపంచదేశాలు దృష్టి సారించాయి.
 
ఘన స్వాగతం..
రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి భారతీయ లడ్డూలు, తృణధాన్యాలతో తయారు చేసిన రొట్టెలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని కజాన్​ లోని హోటల్​ కు చేరుకొని అక్కడ ప్రవాస భారతీయులతో కలిశారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, నృత్యాలతో మోదీకి స్వాగతం పలికారు. రష్యాలో ఉన్న ఇస్కాన్​ సభ్యులు మోదీకి భక్తిగీతాలాపనతో స్వాగతం పలికారు.
 
ఐదు దేశాల చేరికతో బ్రిక్స్​ మరింత బలోపేతం..
కాగా 2024లో 16వ బ్రిక్స్​ సమావేశం మరింత పటిష్ఠమైంది. ఈజిప్ట్​, ఇథియోపియా, ఇరాన్​,సౌదీ అరేబియా, యూఏఈలు కూడా బ్రిక్స్​ లో చేరికతో మరింత బలోపేతం అయింది. ఈ ఐదు దేశాల చేరికతో బ్రిక్స్​ దేశాల జనాభ 350 కోట్లకు చేరిది. అదే సమయంలో ప్రపంచదేశాల్లో బ్రిక్స్​ ఆర్థిక వాటా 75 శాతానికి చేరుకుంది.