కొరడా దెబ్బలతో అన్నామలై నిరసన!
Annamalai protest with lashes!
కోయంబత్తూరు: తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసనలకు తెరతీశారు. శుక్రవారం ఉదయం తన ఇంటి బయట కొరడాతో కొట్టుకున్నాడు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో డీఎంకే సీఎం స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు లేకుండా ఉంటానని శపథం చేసిన మరుసటి రోజే కొరడాతో కొట్టుకుంటూ నిరసనకు దిగారు. ఆయన కొరడాతో కొట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ అభిమాని ఆయన్ను అడ్డుకోగా అన్నామలై అభిమానిని దూరంగా వెళ్లాలన్నాడు. కాగా విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయిన విద్యార్థి డీఎంకే నాయకులతో కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అందుకే అతనిపై చర్యకు వెనకాడుతున్నారని అన్నామలై మండిపడ్డారు. అతనిపై నిర్భయ యాక్ట్ కింద కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నామలై డిమాండ్ చేశారు.