మోదీ ట్రిపుల్​.. ఎగ్జిట్​ పోల్స్​ లో కమల వికాసం

ఇండి కూటమికి తప్పని నిరాశ

Jun 1, 2024 - 21:50
Jun 1, 2024 - 22:25
 0
మోదీ ట్రిపుల్​.. ఎగ్జిట్​ పోల్స్​ లో కమల వికాసం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:

ఏడుదశల్లో ఎన్నికలు ముగిశాయి. అన్ని ఎగ్జిట్​ పోల్స్​ లో బీజేపీ కూటమిదే హావా కనిపిస్తోంది. ఆశించిన మేర సీట్లను ఎన్డీయే కూటమి సాధించే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా (కాంగ్రెస్​ కూటమి)కి మూడోసారి కూడా నిరాశ తప్పేట్లు లేదు. మొత్తానికి 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేనియా పూర్తిగా పనిచేసిందనే చెప్పాలి. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్​ పోల్స్​ ఈ కింది విధంగా ఉన్నాయి. 

సామ్​–జన్​ కీ బాత్​: సర్వేలో ఎన్డీయేకు (బీజేపీ కూటమి) 362 నుంచి 392 స్థానాలు దక్కనుండగా ఇండియా (కాంగ్రెస్​ కూటమి) 141 నుంచి 161, ఇతరులకు 10 నుంచి 20 స్థానాలు దక్కనున్నాయి.

ఇండియా న్యూస్​: ఎన్డీయే 371, ఇండియా 125, ఇతరులు 47.

రిపబ్లిక్​ భారత్​ – మేట్రిజ్​: 353 నుంచి 368 ఎన్డీయే, 118 నుంచి 133 ఇండియా, ఇతరులు 43 నుంచి 48.

రిపబ్లిక్​ టీవీ– పి మార్క్​: ఎన్డీయే 359, ఇండియా 154, ఇతరులు 30

ఇండియా న్యూస్​ – డి డైనమిక్స్​:  ఎన్డీయే 371, ఇండియా 125, ఇతరులు 47.

న్యూస్​ నేషన్​: ఎన్డీయే 342 నుంచి 378, ఇండియా 153 నుంచి 169, ఇతరులు 21 నుంచి 23.

ఏబీపీ–సీ ఓటర్స్​: ఎన్డీయే 244 నుంచి 292, ఇండియా 123 నుంచి 169, ఇతరులు 4 నుంచి 12.

దైనిక్​ భాస్కర్​: ఎన్డీయే 281 నుంచి 350, ఇండియా 145 నుంచి 201, ఇతరులు 33 నుంచి 49.

పోల్​ ఆఫ్​ పోల్స్​: ఎన్డీయే 348 (బీజేపీ కూటమి), ఇండియా 145 (కాంగ్రెస్​ కూటమి), ఇతరులు 33 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది.