హమాస్ ఆర్మీ చీఫ్ ఇస్సా హతం ప్రకటించిన ఐడీఎఫ్
హమాస్ ఆర్మీ చీఫ్ మార్వాన్ ఇస్సాను ఐడీఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) హతమార్చినట్లు ప్రకటించింది. అండర్ గ్రౌండ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది.
జోర్డాన్: హమాస్ ఆర్మీ చీఫ్ మార్వాన్ ఇస్సాను ఐడీఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) హతమార్చినట్లు ప్రకటించింది. అండర్ గ్రౌండ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడిన హమాస్ఉగ్రవాదులు గాజాను విడిచి పారిపోగా చాలామందినే ఐడీఎఫ్ వెతికి వెతికి మరి మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ప్రముఖ నేతలతోపాటు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతీఒక్కరిని హతమార్చామని తెలిపింది. హమాస్ ఆర్మీ చీఫ్ కోసం ఐడీఎఫ్ గాలింపు చర్యల్లో భాగంగా గాజా ప్రాంతంలోని బంకర్లు, భవంతులు అనే తేడా లేకుండా వెతికింది. అయినా ఇస్సా పట్టుబడలేదు. తాజాగా విడుదల చేసిన వీడియోలో అతన్ని హతమార్చామని పేర్కొంది. ఇతని మృతితో ఇక హమాస్ అనే ఉగ్రమూక లేనట్లేనని ఐడీఎఫ్ భావిస్తోంది.