కేరళ, తమిళనాడులో ఎన్నికల తేదీ మార్పు?
సోమవారం ఈసీని కలవనున్న ఐయూఎంల్
చెన్నై: కేరళ, తమిళనాడులో ఎన్నికల తేదీని మార్చాలని ఐయూఎంఎల్(ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్)లు ఈసీని కోరాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26వ తేదీలు శుక్రవారం జరగనుండడంతో ఆందోళన వ్యక్తం చేశాయి. ముస్లింలంతా ఆ ఆరోజు ప్రార్థనల్లో నిమగ్నమవుతారని ఎన్నికల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. అందుకే తేదీలను మార్చాలని విజ్ఞప్తి చేశాయి. శుక్రవారం ఓటింగ్ జరిగితే ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లకు విధుల్లో ఆటంకాలు కలుగుతాయన్నారు. ఓటింగ్లో ఎలాంటి విరామం లేకుండా జరిగితేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సోమవారం ఎన్నికల తేదీని మార్చాలని ఈసీని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఐయూఎంఎల్ తెలిపింది.