ప్రశాంతంగా పోలింగ్​

బీజాపూర్​ లో గ్రెనేడ్​ పేలి జవాన్​ కు గాయాలు మహారాష్ర్టలో ఈవీఎం పనిచేయకపోవడంతో రెండు గంటలు నిలిచిన ఓటింగ్​ కూచ్​ బెహార్​ లో టీఎంసీ రాళ్లదాడులు, బీజేపీ కార్యకర్తకు గాయాలు

Apr 19, 2024 - 11:29
 0
ప్రశాంతంగా పోలింగ్​

రాయ్​ పూర్​: ఓటింగ్​ సందర్భంగా ఉదయం 10 గంటల వరకు పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్​ కొనసాగింది. చత్తీస్​ గఢ్​ లోని బీజాపూర్​ లో పోలింగ్​ బూత్​ కు సమీపంలో గ్రెనేడ్​ పేలడంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతంలో పెద్ద యెత్తున రక్షణ చర్యలు తీసుకున్నారు. కాగా పేలుడులో ఒక సైనికుడికి గాయాలయ్యాయి అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నారు. 

మహారాష్ట్రలోని ఈవీఎం పనిచేయకపోవడంతో రెండు గంటలు ఓటింగ్​ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే మరో ఈవీఎంను తీసుకువచ్చి సజావుగా ఓటింగ్​ నిర్వహణను చేపట్టారు. 

పశ్చిమ బెంగాల్​ లోని కూచ్​ బెహార్​ లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఒక బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోని సమూహాలను చెదరగొట్టి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడి తుఫాన్​ గంజ్​ లోని పోలింగ్​ బూత్​ వద్ద చోటు చేసుకుంది.టీఎంసీ ఓటు వేయకుండా భయబ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ ఆరోపించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్​ లోని ఓ పోలింగ్​ బూత్​ లో ఓటింగ్​ సందర్భంగా గుర్తు తెలియని దుండగులు బుట్టలో పామును వదిలి వెళ్లారు. దీంతో తీవ్ర కలకలం రేగింది.