నా తెలంగాణ, హైదరాబాద్ : సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జుక్కల్ మండలానికి చెందిన10 మంది మాజీ బీఆర్ఎస్ సర్పంచులు, ప్రస్తుత సొసైటీ చైర్మన్లు , మాజీ సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి సమక్షంలో చేరారు.
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ..
తాను బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, ఎస్సీ వర్గీకరణ కోసం, దళిత వర్గాలకు న్యాయం చేకూరుతుందని బీజేపీలో చేరానని బీబీ పాటిల్ వెల్లడించారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ, అభివృద్ధి నాకు ముఖ్యం అని, మోదీ నాయకత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరానని పేర్కొన్నారు. మోదీ నాయకత్వ పాలనను గ్రామ గ్రామానికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీడియా కమిటీ మెంబర్ రాణా, బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రవి గౌడ్, బీసీ మోర్చా అధికార ప్రతినిధి హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.