జపాన్, న్యూజిలాండ్ ప్రధానులతో మోదీ భేటీ
Modi met with Prime Ministers of Japan and New Zealand
ద్వైపాక్షిక బంధాలపైనే ప్రధాన చర్చ
తరచూ ఉన్నతస్థాయి సమావేశాలతోనే సమస్యల పరిష్కారం సాధ్యం
వియాంటియాన్: లావోస్ లో ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న అనంరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి జపాన్, న్యూజిల్యాండ్ ల ప్రధానులతో ద్వైపాక్షిక బంధాలపై చర్చించారు. జపాన్ నూతన ప్రధానమంత్రి షిగేరు ఇషిబా, న్యూ జిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ లతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విస్తృత శ్రేణిలో మెరుగై సహాకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం, అవస్థాపన అభివృద్ధి, రక్షణ, సెమీ కండక్టర్లు, సంస్కృతి, ప్రజల మార్పిడి, శాంతి, సురక్షితమైన ప్రపంచం, సుసంపన్నమైన ఇండోపసిఫిక్ ప్రాంతమై భారత్ తో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు నిబద్ధతతో పని చేసేందుకు ప్రాధాన్యతనిద్దామని ప్రధాని మోదీ తెలిపారు. ఇధనం, విద్య, వ్యవసాయం, సాంకేతికత, క్రీడలు, పర్యాటకం, అంతరిక్షం, పెట్టుబడులు వంటి విషయాలపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ తో చర్చించారు. తరచూ ఇలాంటి ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించడంతో దేశాల్లో బంధాలు, సమస్యల పరిష్కారాలు సులభమవుతాయని ప్రధాని మోదీ తెలిపారు.