మన్మోహన్ కు తాత్కాలిక ప్రధాని నివాళులు
Caretaker Prime Minister pays tribute to Manmohan
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు మంగళవారం నివాళులర్పించారు. ఢాకాలోని భారత హై కమిషన్ లో ఉంచిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తన సందేశాన్ని రాశారు. మన్మోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. హై కమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మతో కాసేపు ముచ్చటించారు. మన్మోహన్ నిరాడంబరమైన నేతగా యూనస్ అభివర్ణించారు. భారత్ ను ఆర్థిక శక్తిగా మార్చడంలో ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బంగ్లా వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నెహ్రూ కుటుంబంతో మంచి సంబంధాలను కలిగి ఉండేది.
పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇంతవరకు సంతాపం కానీ, నివాళులర్పించడం కానీ చేయలేదు. దీనిపై పాక్ లోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా షరీఫ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించకపోవడం పట్ల పాక్ మీడియా కోడై కూస్తుంది. ఇది మంచి సంప్రదాయం కాదని షాబాజ్ తీరును ఎండగడుతుంది.