దేశ నవ నిర్మాణానికి మోదీ వెంటే: అప్నాదళ్
Modi is behind the reconstruction of the country: Apnadal
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ నవ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ వెంట కలిసి పూర్తి సంకల్పంతో పనిచేస్తామని అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్ అన్నారు. కోట్లాది దేశ ప్రజల్లో మోదీ గౌరవం మరింత పెరిగిందన్నారు. మూడోసారి పీఎంకా ఎన్నికవడం అత్యంత సంతోషకరమన్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదనను తాను మనస్ఫూర్తిగా మద్ధతునిస్తున్నానని ప్రకటించారు. భవిష్యత్ లోనూ ఎన్డీయేతోనే కలిసి నడుస్తామని అనుప్రియా పటేల్ స్పష్టం చేశారు.