బస్తర్ లో ఎన్ కౌంటర్ 9మంది నక్సల్స్ మృతి
9 Naxals killed in encounter in Bastar
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడ–బీజాపూర్ సరిహద్దులో భద్రతా దళాలు, నక్సలైట్లకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో 9మంది నక్సలైట్లు మృతి చెందారు. మంగళవారం ఉదయం అందిన సమాచారం మేరకు భద్రతాదళాలు నక్సల్స్ ఉన్న పశ్చిమ బస్తర్ డివిజన్ లో సెర్చింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలపైకి ఒక్కసారిగా నక్సలైట్లు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతాదళాలు ఎదురుదాడికి పాల్పడ్డాయి. దీంతో 9మంది నక్సలైట్లు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి నక్సల్స్ మృతదేహాలతోపాటు ఎస్ ఎల్ ఆర్, 303, 12 బోర్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో సెర్చింగ్ కొనసాగుతోంది. కాగా ఈ ఎన్ కౌంటర్ లో కరడుగట్టి నక్సలైట్ జెట్టీని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇతను 35కు పైగా దాడులు నిర్వహించాడు. ఇతని తలపై ప్రభుత్వం 24 లక్షల రివార్డు ప్రకటించడం గమనార్హం.