మేళాలో మంత్రి రాజ్ నాథ్ పుణ్యస్నానం
Minister Rajnath took holy bath in the fair
లక్నో: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ మేళాలో పుణ్య స్నానమాచరించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్నానానికి ముందు వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం పుణ్య స్నానమాచరించారు. మంత్రి రాక సందర్భంగా శుక్రవారం రాత్రి ఘాట్ల వద్ద అనుమానాస్పదంగా ఉన్న 18 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నారా? లేదా ఇంకేమైనా ఉద్దేశ్యం ఉందా? అనేది విచారిస్తున్నారు. మంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ఆరైల్ లోని డీపీఎస్ లో హెలిప్యాడ్ లో దిగి జాతర ప్రాంతానికి వెళ్లారు. మరోవైపు మంత్రి రాక సందర్భంగా సెక్టార్ 18లో బాంబు ఉందనే కాల్ రావడంతో అధికారులు అణువణువు శోధించారు. ఏమీ లభ్యం కాకపోవడంతో ఉపిరిపీల్చుకున్నారు. ఫేక్ కాల్ పై విచారిస్తున్నారు.