భారత్​పై దాడులు.. ప్రపంచదేశాలు ఏ సూత్రాలను పాటించాయి?

యూఎస్​ఎస్​సీలో మార్పులు జరగాలి.. జపాన్​ పర్యటనలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్​

Mar 8, 2024 - 19:25
Mar 8, 2024 - 19:26
 0
భారత్​పై దాడులు.. ప్రపంచదేశాలు ఏ సూత్రాలను పాటించాయి?

నా తెలంగాణ, ఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌పై దాడులు జరిగాయని, సరిహద్దులను శత్రు దేశాలు ఆక్రమించాయని అంతర్జాతీయంగా ఆ సమయంలో ఎటువంటి సూత్రాలను ప్రపంచదేశాలు పాటించాయో చెప్పాలని తమ దేశంతో ఏ దేశం కలిసి రాలేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్​తెలిపారు. మంత్రి జై శంకర్​ జపాన్​ పర్యటనలో ఉన్నారు. అక్కడ శుక్రవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అంతర్జాతీయ దేశాలు తమతమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే సూత్రాలను ఎంచుకుంటాయని, వ్యవహరిస్తాయన్నారు. ఇతర దేశాలు కూడా ఇవే విధానాలను అనుసరించాలని ఒత్తిడి తీసుకువచ్చారని స్పష్టం చేశారు. రష్యా – ఉక్రెయిన్​ యుద్ధంపై అడిగిన ప్రశ్నకు జై శంకర్​ పై విధంగా సమాధానం ఇచ్చారు. నేడు ప్రపంచదేశాలు చూపుతున్న విలువలు 80 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయాయెందుకని తిరిగి ప్రశ్నించారు? యూఎన్​ఎస్​సీలో సైతం పలు సంస్కరణలు చేయాలని భారత్​కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో 50 మంది సభ్యులే ఉండేవారని, ప్రస్తుతం 200 మంది సభ్యుల వరకు సంఖ్య పెరిగిందని, అదే సమయంలో సభ్యదేశాలకు కౌన్సిల్​లో చోటు దక్కలేదన్నారు. సభ్యదేశాలన్నీ యూఎన్​ఎస్​సీలో మార్పులు జరగాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.