కార్బన్​ డయాక్సైడ్​ నుంచి మిథనాల్​ 

Methanol from carbon dioxide

Nov 8, 2024 - 18:02
 0
కార్బన్​ డయాక్సైడ్​ నుంచి మిథనాల్​ 
వింద్యాచల్ ఎన్టీపీసీ విజయం
50వ వ్యవస్థాపక దినోత్సవంలో అధికారుల వెల్లడి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి విశేష కృషి ఫలితం
లక్నో:  ఎన్టీపీసీ కార్బన్​ డయాక్సైడ్​ నుంచి మిథనాల్​ ను తయారు చేసి పెద్ద విజయాన్ని సాధించింది. శుక్రవారం యూపీలోని వింద్యాచల్​ ఎన్టీపీసీ లిమిటెడ్​ 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపింది. ఈ కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ మేనేజర్​ శంకర్​ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. బొగ్గును కాల్చి మిథనాల్​ ను తయారు చేశామన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్​ ప్లాంట్ల నుంచి కార్బన్​ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టమన్నారు. బొగ్గును కాల్చగా విడుదలైన 10 టీపీడీ కార్బన్​ డయాక్సైడ్​ ద్వారా ఒక డ్రాప్​ గ్రీన్​ మిథనాల్​ ను విజయవంతంగా రూపొందించామన్నారు. దీంతో గ్రీన్​ హైడ్రోజన్​ ద్వారా దేశంలో కాలుష్​య కారకాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నామన్నారు. భవిష్యత్​ లో ఈ పరిశోధనలో మరింత పురోగతి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 2070 నాటికి భారత్​ కాలుష్య కారకాల ఉద్గారాలు సున్నాకు చేర్చాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. దీంతో దేశం గ్రీన్​ ఎనర్జీ దిశగా సత్ఫలితాలను సాధిస్తుందని ఆకాంక్షించారు. 
 
ఉద్గారాల తగ్గింపునకు చర్యలు: కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా తెలంగాణకు చెందిన జి.కిషన్​ రెడ్డి నియమితులయ్యాక బొగ్గు, గనుల శాఖలో కీలకమార్పు చేర్పులను చేపడుతున్నారు. అందులో భాగంగానే కర్బన ఉద్గారాల తగ్గింపునకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కార్మికుల సంక్షేమం, విద్య, వైద్యం తోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో భారీ నిధులను కేటాయించేలా, పరిశోధనలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ  ప్రభుత్వ సహకారంతో భారత్​ లో బొగ్గు, గనుల రంగం అభివృద్ధికి పాటుపడుతున్నారు. అదే సమయంలో మోదీ నేతృత్వంలో భవిష్యత్​ లో కాలుష్య కారకాలను తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీపీసీ పరిశోధనలో ఉద్గారాల నుంచి మిథనాల్​ ను విజయవంతంగా తయారు చేయగలిగింది.