డిజిటల్ చెల్లింపుల్లో మనమే పస్ట్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చల్లింపుల్లో భారత్ ముందున్నదని కేంద్రమంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
నా తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చల్లింపుల్లో భారత్ ముందున్నదని కేంద్రమంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మనదేశంలో డిజిటల్ చెల్లింపులు విఫలమవుతాయని విపక్షాలు అన్నాయని కానీ ప్రస్తుతం అమెరికాను కూడా దాటామని తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. జీతాలివ్వలేని పరిస్థితి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దారని తెలిపారు. యూకే లాంటి దేశాలు కూడా వెనక్కి నెట్టేసి ఐదో స్థానంలోకి రావడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతోనే ఆర్థికంగా బలపడ్డామన్నారు.
పెరిగిన డిజిటల్ చెల్లింపులు..
డిజిటల్చెల్లింపులు చాలా వరకు పెరిగాయన్నారు. ఈ దేశంలో నిరక్ష్యరాస్యత ఉందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని అన్నారు. కానీ ఈ రోజు ప్రతీ చిన్న దుకాణంలో సాంకేతిక లావాదేవీలు పెరిగాయన్నారు. అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకునేటట్లు ప్రయత్నం చేయాలన్నారు. వ్యక్తిగతంగా సంఘంగా ఏర్పడి ఓటు వేసే ఉద్యమాన్ని నడపాలని పేర్కొన్నారు. ఈ అపార్టుమెంట్ కు సంబంధించి 40 శాతం కూడా పోలింగ్ కావడం లేదని అన్నారు. మనమంతా పోలింగ్ పర్సంటేజీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి సంబంధించిన ఓట్లు వచ్చే ప్రాంతంలో పోలింగ్ తక్కువగా నమోదవుతూ ఉంటుందన్నారు. కాబట్టి అందరూ పోలింగ్ లో పాల్గొనాలని అన్నారు. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలని అన్నారు. దీంతో మన భవిష్యత్తు కూడా బాగుపడుతుందన్నారు.
పాక్ ఉగ్రవాదాన్ని తరిమికొట్టాం..
దేశంలో ఎక్కడ చూసినా కూడా అన్ని పట్టణాల్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఉండేవారన్నారు. లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్, దిల్ షుక్ నగర్, ఇలా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద బాంబుపేలుళ్లు జరిగాయో అందరికీ తెలిసిందేనన్నారు. కర్ఫ్యూలు, మతకల్లోలాలు, బాంబుపేలుళ్లు ఉండేవన్నారు. నేడు ఆ పరిస్థితిలో పూర్తి మార్పును ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించామని భారత్ తేల్చి చెప్పిందన్నారు. పాక్ నకిలీ నోట్లు ప్రింట్ ఆగిపోయిందన్నారు. ఉగ్ర కార్యకలాపాలను నిరోధించామన్నారు. పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిగా నిలబెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. మనదేశంతో వైరం వల్ల చైనా కావాలని పాక్ తో దోస్తీ చేస్తున్నదన్నారు. చైనా నుంచి వచ్చే అనేక ఉత్పత్తుల కొనుగోలును భారత్ తగ్గించేయడంతో చైనాకు రుచించడం లేదని అన్నారు. అందుకే చైనా శత్రుదేశం పాక్ తో దోస్తీ చేస్తూ తాను కూడా ఉగ్ర ఊబిలో ఇరుక్కుపోయిందని అన్నారు.
నారీశక్తికి అవకాశాలు..
రామజన్మభూమి, ఆర్టికల్ 370, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించామని కిషన్ రెడ్డి అన్నారు. సైనిక, ఆర్మీలో మహిళలకు అవకాశం కల్పించామన్నారు. 26 జనవరి రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు 90 శాతం ఏర్పాట్లు చేసింది మహిళా దళాలే అన్నారు. నిస్వార్థంగా సమాజం, దేశం కోసం సేవ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
లక్ష్యాన్ని చేరుకుంటాం..
2014లో 270, 2019లో 303 స్థానాలకు పెరిగామన్నారు. 2024లో 370, ఎన్డీయే భాగస్వామ్యంతో 400 పై చిలుకు స్థానాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని.. తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రపంచదేశాల్లో భారతదేశ కీర్తి, గౌరవాలు ఎలా పెరిగాయో అందరూ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. గతంలో భారత ప్రధాని ఎక్కడో లాస్ట్ లో కనిపించేవారని, కానీ ప్రస్తుతం మొదటివరుసలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపిస్తున్నారని కొనియాడారు.
భారతీయులను వెనక్కి తీసుకొచ్చాం..
ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని 48 గంటలపాటు ఆపించి మనదేశ విద్యార్థులు 25 వేల మందిని వెనక్కి తీసుకువచ్చామని, అలాగే టర్కీ, ఇజ్రాయెల్ పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కూడా వెనక్కు తీసుకురాగలిగామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు గౌతం రావు, డివిజన్ అధ్యక్షులు సూర్యవినాయక్, రంగారెడ్డి పాల్గొన్నారు.