ఉత్తరాఖండ్ బడ్జెట్.. రూ. 89230.07 కోట్లు
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీటన్న ఆర్థికమంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రూ. 89230.07 వేల కోట్లతో 2024–25 బడ్జెట్‌ను మంగళవారం ఆ రాష్ర్ట అసెంబ్లీలో సీఎం పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ మాట్లాడుతూ.. రాష్ర్టంలోని అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశామన్నారు.
బడ్జెట్ లో కేటాయింపులు..
యువజన సంక్షేమం, క్రీడలకు రూ. 534 కోట్లు.
సాంకేతిక విద్య రూ.321 కోట్లు.
ఉన్నత విద్యకు రూ. 824 కోట్లు.
అంత్యోదయ ఉచిత గ్యాస్ కోసం రూ. 54 కోట్లు.
ప్రధాని ఆవాస్ యోజనకు రూ. 399 కోట్లు
కార్పస్ ఫండ్ రూ. 44 కోట్లు
ఆహార ధాన్యాల పథకానికి రూ. 20 కోట్లు
వివిధ శాఖల్లో సబ్సిడీలకు రూ. రూ. 679. 34 కోట్లు