మమత రాజీనామా చేయాల్సిందే

బీజేపీ నేత షహజాద్​ పూనేవాలా

Aug 22, 2024 - 13:50
 0
మమత రాజీనామా చేయాల్సిందే

కోల్​ కతా: కోల్​ కతా మెడికోపై అత్యాచారం, హత్య కేసులో మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ నాయకుడు షహజాద్​ పూనేవాలా డిమాండ్​ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సీఎం మమత ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సిందేనన్నారు. హత్య అనంతరం ప్రిన్సిపల్​ రాజీనామా, ఇతర కళాశాలలో నియామకం, సాక్ష్యాల తారుమారు, పరిస్థితులు అదుపు తప్పుతుంటే తమదేం తప్పులేనట్లుగా సీఎం వ్యవహరించడంపై పూనేవాలా మండిపడ్డారు. 

ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిందన్నారు. అత్యాచారం చేసిన వారిని కాడుతూ, సాక్ష్యాలను తారుమారు చేస్తూ, నిజాన్ని దాచుతున్న ప్రభుత్వ తీరుపై వైద్యులు ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని అరెస్టు, లాఠీచార్జీ చేయడం ఏంటని నిలదీశారు. మమత ప్రభుత్వానికి రాష్​ర్ట పోలీసులు ఊడిగం చేస్తున్నారని పూనేవాలా మండిపడ్డారు.