డీకేకు లోకాయుక్త నోటీసులు
అక్రమ ఆస్తులపై వివరాలు కోరిన లోకాయుక్త
బెంగళూరు: ఎన్నికల వేళ కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఆస్తుల కేసుకు సంబంధించిన పత్రాలు అందజేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో శివకుమార్ అక్రమ ఆస్తుల కేసును సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. అనంతరం సీబీఐ ఆ కేసును లోకాయుక్తకు బదిలీ చేసింది. దీంతో లోకాయుక్త గతంలో సీబీఐకి సమర్పించిన ప్రతాలను కూడా అందజేయాలని డీకే.శివకుమార్‌కు పంపిన నోటీసులో స్పష్టం చేసింది. ఆదాయానికి మించి రూ.74.93 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టారని డీకే శివకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.
నోటీసులపై ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కేసుపై న్యాయపోరాటం చేస్తానన్నారు.
కాగా తెలంగాణ ఎన్నికల్లోనూ డీకే శివకుమార్ భారీ ఎత్తున డబ్బులు ఇతర మార్గాల ద్వారా అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతోనే తెలంగాణలో కాంగ్రెస్ గట్టెక్కిందని కూడా పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కూడా డీకే భారీ ఎత్తున డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.