తిరంగ ర్యాలీ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు
Life imprisonment for the convicts in the Tiranga rally murder case
లక్నో: కాస్ గంజ్ తిరంగ యాత్ర ర్యాలీ హత్య కేసులో 28 మంది దోషులకు ఎన్ ఐఎ కోర్టు జీవిత ఖైదు విధించింది. శుక్రవారం ఈ కేసులో శిక్షలను ఖరారు చేసింది. గురువారమే 28మందిని దోషులుగా ఖరారు చేసి శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే శిక్షను ఖరారు చేయలేదు. చందన్ గుప్తా హత్య జరిగి ఆరేళ్ల 11 నెలల ఏడు రోజులు గడిచింది. 2018 జనవరి 26న గుప్తా హత్య జరిగింది. న్యాయం కోసం చందన్ గుప్తా కుటుంబం సుదీర్ఘంగానే పోరాడింది. దోషులకు శిక్ష ఖరారు చేయడంతో కాస్ గంజ్ లో మరోమారు పోలీసులు హై అలర్ట్ లో ఉన్నారు. 144 సెక్షన్ ను ప్రకటించారు. అలాగే గుప్తా ఇంటి వద్ద తల్లిదండ్రులకు కూడా భద్రత కల్పించారు. కోర్టు ఆవరణ, వెలుపల కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చార్జీషీటులో 30మందిని నిందితులుగా ఎన్ ఐఎ పోలీసులు చార్జీషీటు దాఖలు చేశారు. కాగా ఇద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించినందున కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. హత్యకు కారణమైన వారిపై ఎన్ ఐఎ ఐపీసీ సెక్షన్ 147, 148, 307/149, 302/149, 341, 336, 504, 506 కేసులు నమోదు చేసింది.