లాలూ పాలనలో మహిళలపై వివక్ష
బిహార్ సీఎం నితీశ్ కుమార్
పాట్నా: లాలూ పాలనలో రాత్రిపూట మహిళలు బయటకు వెళ్లే పరిస్థితులు ఉండేవా? అని బిహార్ సీఎం నితీశ్ కుమార్ లాలూ (ఆర్జేడీ)పై విరుచుకుపడ్డారు. ఆదివారం ఓ కార్యక్రమం సందర్భంగా ఆర్జేడీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం మహిళలకు బిహార్ లో ఏ విధమైన స్వేచ్ఛ ఉందో చూడాలన్నారు. విద్య, వైద్యం, వ్యాపారం లాంటి వాటిలో వారిని భాగస్వాములుగా చేశామన్నారు. ఇటీవల నితీశ్ కుమార్ ఆర్జేడీ, ఇండికూటమితో కలిసి వెళతారని అసత్య ప్రచారాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రెండుసార్లు వారితో కలిసి వెళ్లింది చాలని ఇక వారితో ప్రయాణించలేనని కుండబద్ధలు కొట్టారు. ఎన్డీయేతోనే తమ ప్రయాణమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 2005 తరువాత హిందూ-ముస్లిం, ఫార్వర్డ్-బ్యాక్‌వర్డ్, దళిత్-మహాదళిత్ సహా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేశామని అన్నారు. ప్రస్తుతం బిహార్ లో ఎన్నో రకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత తమదేనని నితీశ్ కుమార్ అన్నారు.