గరియాబంద్ లో ఎన్ కౌంటర్ ముగ్గురు నక్సల్స్ మృతి
Three Naxals killed in encounter in Gariaband
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లోని గరియాబంద్‌లో ముగ్గురు నక్సలైట్ల ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం అర్థరాత్రి నుంచి 300మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ సైనికులు ఇందగావ్ స్టేషన్ పరిధిలోని సోర్నామల్ అటవీ ప్రాంతాన్ని తమ స్వాధీనం లోకి తీసుకొని జల్లెడపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఎన్ కౌంటర్ లో ముగ్గురు నక్సలైట్లు మృతిచెందినట్లు ప్రకటించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. సోర్నామల్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నట్లుగా ఇంటలిజెన్స్ కూంబింగ్ బృందాలకు సమాచారం అందజేసింది. దీంతో పెద్ద యెత్తున సెర్చ్ ఆపరేషన్ కు రంగంలోకి దిగారు.