నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
లెజిన్సీ ఆఫ్ నరేంద్ర మోదీ.. బలోపేతమైన నాయకుడు, ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం, చెప్పేదే సంకల్పం, ధృఢమైన సంకల్ప బలం, అన్నింటికంటే మించి అమితమైన దేశభక్తి, భారతీయులు, హిందూ సమాజంపై ప్రేమ. మోదీలోని ఈ సుగుణాలే ఆయన్ను ప్రపంచంలో అత్యంత బలమైన నాయకుడిగా నిలబెట్టగలిగారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీన 74వ పడిలోకి అడుగు పెట్టనున్నారు. మంగళవారం ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ, పలు సంఘాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుడుగా మోదీ ఎదిగారు. ఈయనతో గత వందేళ్ల రికార్డును తిరగరాసుకున్నా దూరదూరా కూడా ఈయనకు సరిసాటి ఎవ్వరూ లేకపోవడం విశేషం.
చాయ్ వాలా నుంచి మేటి నాయకుడిగా..
మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయంతో సత్తా చాటగలిగారు. కటిక పేదరికం నుంచి వచ్చిన మోదీ చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించి బీజేపీలో చేరి అంచలంచలుగా ఎదుగుదూ ప్రపంచంలోనే మేటి నాయకుడుగా నిలవగలిగారు. ఇది ఆయన దర్శనం, పట్టుదల, నమ్మకం, విశ్వాసాలు, దేశంపై ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీ కోసం.
హ్యాట్రిక్ తో కాంగ్రెసేతర పీఎం తొలిసారి ఎంపిక..
కాంగ్రెస్ గాకుండా తొలిసారిగా ఇతర పార్టీ నుంచి మూడుసార్లు పీఎంకా ఎన్నికైన నాయకుడుగా మోదీ ఎదిగారు. 21 రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేగలిగారు. 2014లో తొలిసారిగా బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2018– 21 రాష్ర్టాల్లో బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో తొలిసారిగా బీజేపీ కాంగ్రెస్ ను ఘోర పరాజయం పాలు చేస్తూ 303 సీట్లను కైవసం చేసుకుంది. 2023 రాజ్యసభలో తొలిసారిగా బీజేపీ సభ్యుల సంఖ్యను 96కు పెంచుకుంది. 2024లో బీజేపీ విజయంతో మోదీ హ్యాట్రీక్ సాధించారు.
చైనా కమ్యూనిస్టులు వెనక్కే..
బీజేపీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 18 కోట్లమంది సభ్యులతో చైనా కమ్యూనిస్టు పార్టీని వెనక్కు నెట్టింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీకి కేవలం 9.9 కోట్ల మంది సభ్యులే ఉన్నారు. 2015లోనే బీజేపీ ఈ రికార్డును తిరగరాసింది.
563 జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాలు..
బీజేపీకి దేశవ్యాప్తంగా 563 జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. నేషనల్ ఎగ్జిక్యూటీవ్, పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, నేషనల్ కౌన్సిల్ లో మోదీ సభ్యులుగా ఉన్నారు. ఈ కౌన్సిల్ లో తీసుకున్న ఏ నిర్ణయానికైనా మోదీ ఆమోదముద్ర తప్పనిసరి
పీఎంవోలో 301మందికి చోటు..
1948–49లో పీఎంవో (ప్రధానమంత్రి కార్యాలయం)లో 116 ఉండేవారు. ప్రస్తుతం మోదీ హయాంలో ఆ సంఖ్య 301కి చేరుకుంది. ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాల పత్రాలు పీఎంవో కార్యాలయానికి వెళ్లేవి కావు. 2017 తరువాత మోదీ ప్రభుత్వం ప్రతీ నిర్ణయానికి సంబంధించిన పత్రాలు పీఎంవోకు రావాల్సిందిగా నిర్ణయం తీసుకుంది. 2020లో రామ మందిర నిర్మాణ బాధ్యతను కూడా ఈకార్యాలయానికి చెందిన ప్రధానాధికారి నృపేంద్ర మిశ్రాకు అప్పగించింది.
జీఎస్టీకి తరుణ్ బజాజ్..
2017లో జీఎస్టీ అమలు కోసం పీఎంవో కార్యాలయం మరో ముఖ్యాధికారి తరుణ్ బజాజ్ కృషి చేశారు. ఈయన ఆధ్వర్యంలోనే జీఎస్టీ అమలైంది. రఫేల్ 2017లో పీఎంవో అధికారి వినయ్ మోహన్ క్వాత్రా నేతృత్వంలో ఫ్రాన్స్ తో ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రఫేల్ నిర్విఘ్నంగా భారత్ వినీలాకాశంలో భద్రత కల్పిస్తుంది.
ఖతర్ సైనికులను రక్షణకు దీపక్ మిత్తల్
2024 ఖతర్ లో 8మంది భారతీయ సైనికులకు ఉరిశిక్ష పడింది. పీఎంవో కార్యాలయం జాయింట్ సెక్రెటరీ దీపక్ మిత్తల్ మోదీ నేతృత్వంలో ఖతర్ కు వెళ్లి వారి శిక్షను రద్దు చేయించడమే గాక వారందరినీ సురక్షితంగా భారత్ కు తీసుకురాగలిగారు.
ఇందిరమ్మ రికార్డు బద్దలు..
1971లో ఇందిరాగాంధీ హయాంలో 17 రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2018లో పీఎం మోదీ నేతృత్వంలో 21 రాష్ర్టాల్లో అధికారంలోకి తీసుకువచ్చి ఆ రికార్డును బద్ధలు కొట్టినట్లయింది. 1990కి ముందు ఇక దేశంలో వేరే పార్టీలు భారత్ లో మనుగడ సాధించలేవనే ఉండేవి. కానీ మోదీ నేతృత్వంలో బీజేపీ అంచలంచలుగా ఎదిగేలా కృషి చేసి దేశ ప్రజల మనస్సుల్లో కమలాన్ని వికసింప చేసేలా చేసిన బృహత్తర ప్రయత్నం విజయం సాధించింది. పట్టులేని నాయకులను కూడా నిలబెట్టి మోదీ నేతృత్వంలో గెలిపించుకోవడం విశేషం.
సామాజిక మాధ్యమాల్లో మోదీ హల్ చల్..
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుడుగా రెండో స్థానంలో ఉన్నారు. ఈయనకు ఎక్స్ లో 10.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 9.1 కోట్లమంది, ఫేస్ బుక్ లో 4.9 కోట్ల మంది, యూట్యూబ్ లో 2.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో మోదీ నంబర్ 1గా నిలవగా, ఎక్స్, ఫేస్ బుక్ లలో ఒబామా ముందంజలో ఉండగా, మోదీ రెండో స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ లో మోదీ అంటే ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్ గా పేరు పొందింది. ఈ సంస్థ మోదీకి ఇచ్చిన రేటింగ్ 72 శాతం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే మోదీకి రెండితల రేటింగ్ పెరిగింది. ఇక దేశీయంగా మోదీ బ్రాండ్ విలువ రూ. 413 కోట్లుగా డిజిటల్ ర్యాంకింగ్ సంస్థ చెక్ బ్రాండ్ లెక్కగట్టింది. అమెరికా రీసెర్చ్ సెంటర్ వ్యూ లెక్కల ప్రకారం భారత్ లో ప్రతీ 10మందిలో 8మంది మోదీకి అనుకూలంగా ఉన్నారు. 2019లో సీఎస్ డీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ ఆసక్తికర సర్వేలో మోదీ బీజేపీలో లేకుంటే ప్రస్తుతం ఆ పార్టీకి వస్తున్న ఓట్లలో 75 శాతం ఓట్లు గల్లంతే!
మనసు, మెదళ్లలో మోదీ గ్లోబల్ లీడర్ ఠీవీ నడక చెరిగిపోని ముద్ర..
నెహ్రూ, ఇందిరాగాంధీల పేర్లు ఉచ్ఛరించగానే రాజకీయాల్లో అనుభవం, ఆసక్తి ఉన్న వారి మనసుల్లో ఏదో ఆలోచిస్తున్న, బలమైన మహిళా నాయకురాలిగా ముద్ర అనేది కనబడుతుంది. అదే మోదీ పేరు ఉచ్ఛరించగానే విదేశాల్లో సైతం భారత్ పేరును ఎత్తుకు ఎదిగేలా ప్రసంగిస్తున్న తీరు ప్రతీ ఒక్కరి మనసుల్లోనూ, మెదళ్లలోనూ కనిపిస్తుంది. గ్లోబల్ లీడర్ లా ఆయన ఠీవీ నడకతీరు ముద్రవేసుకుంది.
నోట్ల రద్దుతో టెర్రర్ ఫండింగ్ దుకాణం బంద్..
2016 నవంబర్ 8 రాత్రి 8 గంటలు ఒక్కసారిగా దేశంలో కలకలం. భారత్ లో 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. పాత నోట్ల స్థానంలో కొత్తగా 500, 2000 నోట్లను తీసుకువచ్చారు. దీంతో బ్లాక్ మనీ, టెర్రర్ ఫండింగ్ మూలాలన్నీ ఒక్కదెబ్బతో విలవిల్లాడిపోయాయి. ఈ రోజు వరకు 99 శాతం ఆ నోట్లు ఆర్బీఐకి వచ్చాయి.
బాలాకోట్ లో తొలిసారి భారత ఉగ్రరూపం ప్రదర్శన..
బాలాకోట్ ఎయిర్ స్ర్టైక్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నేతృత్వంలోని వాయుసేన ఒక్కసారిగా దాడులు చేసి 300మంది ఉగ్రవాదులను అంతం చేసింది. దీంతో ప్రపంచదేశాల్లో భారత్ ఉగ్రరూపం ప్రదర్శించినట్లయ్యింది. పాక్ తోక పూర్తిగా కత్తిరించినట్లయ్యింది. 1971 యుద్ధం తరువాత తొలిసారిగా పాక్ లోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
కరోనాతో స్తబ్ధత..
2020 మార్చి 24 రాత్రి 8 గంటల నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పీఎం మోదీ ప్రకటించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా దేశంలోని అన్ని కార్యకలాపాల్లో స్తబ్ధత నెలకొంది.
2015 డిసెంబర్ 25 కాబూల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రధాని మోదీ పాక్ లోని లాహోర్ కు వెళ్లి నవాజ్ షరీఫ్ తో కలిశారు.
సాహసోపేతమైన నిర్ణయాల వల్లే నరేంద్రుడికి ఆదరణ..
ఆర్టికల్ – 370 రద్దు, జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి, రామ మందిర నిర్మాణం, సీఏఏ అమలు, ట్రిపుల్ తలాక్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, దళిత రిజర్వేషన్లు, వక్ఫ్ చట్టం, నూతన పార్లమెంట్ నిర్మాణం, రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా పేరు మార్పు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ), నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం ప్రారంభం, మోదీ పేరుతో స్టేడియం, చాయ్ పే చర్చ, మన్ కీ బాత్, పరీక్ష పర్ చర్చ వంటి కీలక నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు మోదీ తీసుకోగలిగారు. అందుకే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అంత ఆదరణ ఏర్పడింది.
2014, 2019, 2024 ఎన్నికలలో 167 ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఉన్నారు.
పురస్కారాలు..
దేశం పురస్కారం
సౌదీ అరేబియా - కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్
రష్యా – ది ఆర్డర్ ఆఫ్ ది హోలీ అపోస్టిల్ ఆండ్రూ ది ఫస్ట్
పాలస్తీనా – గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా
ఆఫ్ఘనిస్తాన్ – అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు
yuEI – ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు
మాల్దీవులు – రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్
బహ్రెయిన్ – కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్
భూటాన్ – ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో
పపువా గినియా – గ్రాండ్ కంపా న్యూనియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగో
ఫిజీ – కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ
ఈజిప్ట్ – ఆర్డర్ ఆఫ్ నైలు
ఫ్రాన్స్ – గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్
గ్రీస్ – ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్
2018లో పీఎం శాంతి, అభివృద్ధికి చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని అందుకున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డును, కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ ద్వారా గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డును కూడా ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. అత్యున్నత పురస్కారాలలో ఇన్ని అవార్డులు అందుకున్న భారత ప్రధానుల్లో మోదీయే నంబర్ వన్ గా నిలవడం. దేశ చరిత్రలో ఏ ప్రధానికి ఇన్ని అవార్డులు లభించలేదు.