కేదార్​ నాథ్​ లో విరిగిపడ్డ కొండచరియలు

ఐదుగురు మృతి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​ 

Sep 10, 2024 - 14:10
 0
కేదార్​ నాథ్​ లో విరిగిపడ్డ కొండచరియలు
డెహ్రాడూన్​: ఉత్తరాఖండ్​ లోని రుద్రప్రయాగ్​ కేదార్​ నాథ్​ కు వెళ్లే మార్గంలో భారీ కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు యాత్రికులు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఎస్డీఆర్​ ఎఫ్​ బృందాలు శిథిలాల నుంచి మృతదేహాలను బయటికి తీశారు. మృతుల్లో ఒక నేపాల్​, ముగ్గురు మధ్యప్రదేశ్​, ఒకరు గుజరాత్​ కు చెందిన వారిగా అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలతో పలు కొండ ప్రాంతాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడుతున్నాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు. కొండచరియలు 
 
చత్తీస్​ గఢ్​ లోని రాయ్​ పూర్​, సూక్మా, బీజాపూర్​ జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎన్​–30, ఎన్​–63లు నీట మునిగాయి. మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ కనెక్టివిటీ కోల్పోయింది.
 
యూపీ సహా 25 రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల అలర్ట్​ విధించింది.మధ్యప్రదేశ్​, చత్తీస్​ గఢ్​ లలో రెడ్​ అలర్ట్​ జారీ కాగా, యూపీ, మహారాష్ర్టలో ఆరెంజ్​ అలర్ట్​ లను జారీ చేసింది.
 
మధ్యప్రదేశ్​ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 12 మంది మృతి చెందారు. రాజస్థాన్​ లో 340 చిన్నాచితకా డ్యామ్​ లు పూర్తిగా పొంగిపోర్లుతున్నాయి. ఒడిశాలో రోడ్లు కొట్టుకుపోయి మూడు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ కు రాకపోకలు నిలిచిపోయాయి. 
 
ఐఎండీ అలర్ట్​ జారీ..
సెప్టెంబర్ 11న వాతావరణ శాఖ రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, బిహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, కర్ణాటక, త్రిపురలో రెయిన్ అలర్ట్ జారీ చేసింది.