నా తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు ధరించి ఊయలలు ఊగుతూ, ఉట్టి కొడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు. చిన్న పిల్లల ఆటపాటలు అందరిని ఆకర్షించాయి.
ఈ సందర్బంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతీ పండగకు సబంధించి వాటి ప్రాముఖ్యత పిల్లలకు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ సురకంటి వనమాల మాట్లాడుతూ పిల్లలకు మన పండగల గురించి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలని, విద్యతో పాటు ఆటలు, పాటలు అవసరమని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ఏనుగు మంజుల, ప్రవీణ్, నిజాముద్దీన్, లక్ష్మణ్, అశోక్, పి.ఇ.టీ అల్లం సాయికిరణ్ రెడ్డి, ఉపాధ్యాయుని బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.