సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై ఐటీ రైడ్​

IT Raid on CM's Personal Secretary

Nov 9, 2024 - 12:25
 0
సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై ఐటీ రైడ్​

రాంచీ: ఝార్ఖండ్​ ఎన్నికల నేపథ్యంలో సీఎం హేమంత్​ సోరెన్​ వ్యక్తిగత కార్యదర్శి సునీల్​ శ్రీవాస్తవ్​ ఇంటిపై శనివారం వేకువజామునుంచే ఐటీశాఖ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు లభించినట్లు సమాచారం. సీఎం హేమంత్​ సోరెన్​ అవినీతికి సంబంధించి మరిన్ని ఆధారాలు, నగదు లావాదేవీల్లో తేడాలను, అవకతవకలను ఐటీ శాఖ గుర్తించింది. రాంచీతో సహా 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హేమంత్​ సోరెన్​ ఆర్థిక లావాదేవీలన్నీ శ్రీవాస్తవే చూసుకుంటాడు. సీఎంకు, ఆయన కుటుంబ సభ్యులకు నమ్మినబంటు.  సీఎం జైలులో ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలకు కావాల్సిన ఆర్థిక లావాదేవీలను కూడా ఇతనే నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఇతనిపై ఐటీ రైడ్స్​ జరగడం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. 

ఝార్ఖండ్​ లో తొలి విడత ఎన్నికలు 13వ తేదీన, రెండో విడత ఎన్నికలు 20వ తేదీన జరగనుండడంతో అన్ని శాఖలు దాడులను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఈడీ సీఎం హేమంత్​ సోరెన్​ కు సంబంధించిన పలు ఆస్తులను జప్తు చేసింది.