సీఎం రేవంత్​ను కలిసిన కేకే

సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు.

Mar 29, 2024 - 19:00
 0
 సీఎం రేవంత్​ను కలిసిన కేకే

నా తెలంగాణ, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరతానని గురువారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. త్వరలో తన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇటీవల కేశవరావు ఇంటికి వెళ్లిన దీపా దాస్‌మున్షీ.. కేకేతోపాటు ఆయన కుమార్తెను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం అప్పటి నుంచే జరుగుతోంది. తాజాగా గురువారం కేకే నిర్ణయంతో అది ఖరారైంది.