వక్ఫ్​ సవరణ బిల్లుపై  జాయింట్ కమిటీ సమావేశం

సూచనలు, సలహాలు స్వీకరణ

Sep 6, 2024 - 19:41
 0
వక్ఫ్​ సవరణ బిల్లుపై  జాయింట్ కమిటీ సమావేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వక్ఫ్​ (సవరణ) బిల్లు–2024పై న్యూ ఢిల్లీలోని ఎంపీ జగదాంబికా పాల్​ అధ్యక్షత జాయింట్​ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్కియాలజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా, జకాత్​ ఫౌండేషన్​ ఆఫ్​ ఇండియా, తెలంగాణ వక్ఫ్​ బోర్డు ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలను కమిటీ ముందుంచారు. లోక్​ సభ ఎంపీ జగదాంబికాపాల్​ అధ్యక్షతన 31మందితో కూడిన జాయింట్​ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 21మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 10మంది సభ్యులున్నారు. 

వక్ఫ్​ ఆస్తుల నిర్వహణ, అధికారాలను ఆ సంస్థకు చెందిన సభ్యులకే అప్పగించాలని సమవేశంలో పలువురు పేర్కొన్నారు. అదే సమయంలో ముస్లిం వర్గాలకు మాత్రమే దీనిపై పూర్తి అధికారాలుండాలన్నారు. ఇతర కమ్యూనిటీలను ఈ బిల్లు నుంచి తొలగించాలన్నారు. 

వక్ఫ్​ బోర్డు సవరణ ద్వారా షియా, సున్నీ, బోహ్రా, అగాఖానీ, ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో సవరణ బిల్లులో మరిన్ని సవరణలు చేయాలని పలు రాజకీయ పార్టీలు, పలు సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.