రష్యాపై జపాన్ ఆంక్షలు!
Japan sanctions on Russia!
టోక్యో: రష్యాపై జపాన్ పలు ఆంక్షలను విధించింది. చీఫ్ క్యాబినెట్ కార్యదర్శి యోషిమాసా హయాషి శుక్రవారం క్యాబినెట్‌కు తెలిపారు. ప్రపంచ శాంతిని పునరుద్ధరించేందుకు, రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ప్రయత్నమేనని పేర్కొన్నారు. సంస్థలు, బ్యాంకులపై ఈ ఆంక్షలు విధించినట్లు హయాషి ప్రకటించారు. 11మంది వ్యక్తులు, 29 సంస్థలు, మూడు రష్యన్ బ్యాంకులపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. దీంతో ఈ సంస్థలు, వ్యక్తులు, బ్యాంకులు చేసే పూర్తి కార్యకలాపాలు జపాన్ లో నిలిచిపోనున్నాయి. ఈ సంస్థలు రష్యాకు విరివిగా ఉత్పత్తులను ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడమే జపాన్ నిషేధానికి కారణం. గతంలో కూడా జపాన్ రష్యాపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు రష్యాయేతర సమూహాలపై వర్తించనున్నాయి. వీటిలో హాంకాంగ్ 11, చైనా 7, టర్కీకి చెందిన 8 సంస్థలున్నాయి.