రామ మందిర సందర్శనపై వేధింపులు తట్టుకోలేక బీజేపీలోకి రాధిక ఖేరా

కాంగ్రెస్​ వేధింపుల కారణంగానే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ నాయకురాలు రాధిక ఖేరా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశాభివృద్ధికి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

May 7, 2024 - 17:39
 0
రామ మందిర సందర్శనపై వేధింపులు తట్టుకోలేక బీజేపీలోకి రాధిక ఖేరా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్​ వేధింపుల కారణంగానే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ నాయకురాలు రాధిక ఖేరా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశాభివృద్ధికి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె కేంద్ర బీజేపీ నాయకుల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 

అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించినప్పటి నుంచి పార్టీలో వేధింపులు ఎక్కువయ్యాయని, ఈ విషయాన్ని అగ్రనాయకులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సాయం చేయలేదని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా ఛత్తీస్‌గఢ్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్‌పర్సన్ సుశీల్ ఆనంద్‌తో పాటు మరికొంత మంది తనను చెప్పుకోలేని పదజాలంలో దుర్భాషలాడినట్లు ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.రాధిక ఖేరా సోమవారమే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.