2.61 కోట్ల వాహనాల విక్రయాలు ఎఫ్​ ఎడీఎ నివేదిక వెల్లడి

2.61 crore vehicle sales revealed by FDA report

Jan 10, 2025 - 17:37
 0
2.61 కోట్ల వాహనాల విక్రయాలు ఎఫ్​ ఎడీఎ నివేదిక వెల్లడి


నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024 సంవత్సరంలో ఎఫ్​ ఎడీఎ (ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్స్​) దేశవ్యాప్తంగా వాహన విక్రయాలు 2.61 కోట్లుగా నమోదైనట్లు శుక్రవారం నివేదిక విడుదల చేసింది. టూవీలర్​, త్రీవీలర్​, కార్లు, ఎలక్ర్టిక్​, ప్యాసింజర్​ వాహనాలున్నాయని నివేదిక పేర్కొంది. 2,61,07,679 వాహనాల విక్రయాలతో 9.11 శాతం పెరిగాయి. 12,73,428 ద్విచక్ర వాహనాలు, 81,788 త్రీ వీలర్లు, 81,442 వాణిజ్య వాహనాలు, 3,57,788 ప్యాసింజర్​ వాహనాలు, 1,00,294 ట్రాక్టర్లు విక్రయాల్లో ఉన్నాయి. 2023తో పోలిస్తే వాహనాల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ద్విచక్రవాహనాల్లో 10.78 శాతం, త్రీవీలర్ల విక్రయాల్లో 10.49 శాతం వృద్ధి నమోదైంది. ఒక్క గుజరాత్​ లోనే 2023తో పోలిస్తే వాహన విక్రయాల్లో 14.13 శాతంతో టాప్​ లో ఉంది. మొత్తంగా చూసుకుంటే 2024 వాహనాల విక్రయాలు 158.99 శాతం వృద్ధి నమోదైంది. టూవీలర్ల వాహనాల అమ్మకాల్లో హీరో మోటార్ కార్ప్స్​ మొదటి వరుసలో నిలిచింది. త్రీ వీలర్​ విక్రయాల్లో బజాజ్​ ఆటో, కమర్షియల్​ వాహన విక్రయాల్లో టాటా మోటార్స్​, ట్రాక్టర్ల విక్రయాల్లో మహీంద్రా అండ్​ మహీంద్రాలో తొలివరుస అమ్మకాల్లో నిలిచాయి.