ఓట్లను విడగొట్టాలన్న పాచిక పారలేదు

The dice to split the votes were not cast

Jan 10, 2025 - 18:17
 0
ఓట్లను విడగొట్టాలన్న పాచిక పారలేదు

హిందువులంతా బీజేపీకి ఓటు వేయడాన్ని జీర్ణించుకోవడం లేదు
బీజేపీ మహారాష్ట్ర మంత్రి నితీశ్​ రాణే

ముంబాయి: హిందువులంతా బీజేపీకి ఓటు వేయడాన్ని ముస్లిం వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, ఓట్లను పార్టీలు, కులాలు, మతాల పేరుతో విడగొట్టాలన్న వారి పాచిక పారకపోవడంతో ఆందోళనలో ఉన్నారని మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితీశ్​ రాణే అన్నారు. శుక్రవారం సాంగ్లీలోని హిందూ గర్జన సభలో నితీశ్​ మాట్లాడారు. ఈవీఎంలపై విపక్షాల ఆరోపణలు ఆ పార్టీలు విఫలమైనందుకే అన్నారు. తామెప్పుడూ ఆరోపణలు చేయలేదన్నారు. హిందువులంతా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీకి ఎలా ఓట్లు వేశారని ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదన్నారు. ముస్లింల ఓట్లు తమకు అవసరం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు సౌదీ నుంచి ముంబాయికి నిధులు సేకరించినా హిందువులు తలొగ్గక తనను గెలిపించారని అన్నారు. లవ్​ జిహాద్​ ను వివరిస్తే ప్రతీ ఒక్కరూ ఆశ్చర్య పోవడం ఖాయమన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు నితీశ్​ రాణే హిందూ ఆక్రోశ్​ మోర్చా పేరుతో అనేక ప్రదర్శనలు నిర్వహించి పోస్టర్​ బాయ్​ గా నిలిచారు. నితీశ్​ కంకావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 52వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయన అన్నయ్య నీలేష్​ కుడాల్​ నుంచి ఎమ్మెల్యే కాగా, తండ్రి రత్నగిరి సింధుదుర్గ్​ నుంచి ఎంపీగా ఉన్నారు.