జాదవ్ కిడ్నాప్.. ముఫ్తీ హత్య!
Jadhav kidnapped.. Mufti murdered!

ఇస్లామాబాద్: పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కిడ్పాప్ లో సహాయం చేసిన ముఫ్తీ షా మీర్ హత్యకు గురయ్యాడు. ఇతనిపై శుక్రవారం గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబట్టట్టు ఆలస్యంగా ఆదివారం మీడియాకు సమాచారం అందింది. 2016లో ఇరాన్ లో ఉన్న జాదవ్ ను ఐఎస్ఐ సహాయంతో కిడ్నాప్ చేసి పాక్ చేతిలో పెట్టారు. బలూచిస్థాన్ లో శుక్రవారం ప్రార్థనల అనంతరం దుండగులు మీర్ పై కాల్పులకు తెగబడ్డారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
పాక్ ప్రభుత్వం జాదవ్ పై దేశద్రోహం కింద విచారణ చేస్తుంది. ఈ విషయంపై పలుమార్లు భారత్ ఎన్నో అభ్యంతరాలను చెప్పినా, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినా, ఉరిశిక్ష రద్దయ్యింది కానీ జాదవ్ ఇప్పటికీ పాక్ జైలులోనే ఉన్నాడు. ముఫ్తీ మీర్ మానవ అక్రమ రవాణాకు పాల్పడే జమియత్ ఉలేమా ఇ ఇస్లాం సభ్యుడు. భారత్ లోనూ చోటు చేసుకున్న అక్రమ చొరబాట్లలో ఇతని హస్తం ఉన్నట్లు ఇంటలిజెన్స్ గుర్తించింది. కాగా జాదవ్ కిడ్నాప్‌లో కీలక పాత్ర పోషించిన జైష్ అల్-అద్ల్ సభ్యుడు ముల్లా ఒమర్ ఇరానీని 2020లో టర్బాట్‌లో ఐఎస్ఐ కార్యకర్తలు కాల్చి చంపారు.