ఉక్రెయిన్​ పై భారీ వైమానిక దాడి

14 మంది మృతి, 30మందికి గాయాలు

Mar 8, 2025 - 17:46
 0
ఉక్రెయిన్​ పై భారీ వైమానిక దాడి

కీవ్​: అమెరికా నిఘా సమాచారం అందజేయడం నిలిపివేశాక ఉక్రెయిన్​ పై రష్​యా భారీ దాడికి పాల్పడింది. శనివారం వేకువజామున జరిగిన ఈ దాడిలో 14 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  రష్​యా కీవ్​ లో వరుస వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో డోబ్రో పిల్యా పట్టణంలోని 8 అపార్ట్​ మెంట్లు దెబ్బతిన్నాయి. పలు నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి, నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. కాగా అగ్నిమాపక శకటం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా రష్​యా ఆ వాహనంపై కూడా దాడికి పాల్పడింది. దీంతో ఉక్రెయిన్​ లో సంతాప దినంగా పాటించాలని డొనెట్​ గవర్నర్​ నిర్ణయించారు. వెంటనే రెస్క్యూ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. దాడుల్లో ఐదుగురు చిన్నారులు కూడా గాయపడడం విచారకరమని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.