ఉపరాష్ట్రపతికి అనారోగ్యం.. ఎయిమ్స్ లో చికిత్స
త్వరగా కోలుకోవాలన్న ప్రధాని మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం తెల్లవారుజామున ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చి చికత్స అందిస్తున్నారు. ఆయన ఛాతినొప్పితో బాధపడుతున్నారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్సనందిస్తుంది. జగదీప్ 2022 ఆగస్ట్ 11న 14వ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1951 జూలై 18న రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలోని కాళీబంగ్లాలో జన్మించారు. జగదీప్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కూడా విధులు నిర్వహించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యనభ్యసించి న్యాయపట్టాను పొందారు. ఓ వైపు న్యాయవాదిగా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ బీజేపీకి సేవలందించారు. అనేక పదవులను నిర్వహించిన జగదీప్ ఉపరాష్ర్టపతికి ఎంపికయ్యారు.
ప్రధాని మోదీ పరామర్శ..
ఉపరాష్ర్టపతి ఆరోగ్య విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఆదివారం ఉదయం ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధంఖర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
........................