ట్రూడో రాజీనామాకు అన్ని కారణాలా?!

All the reasons for Trudeau's resignation?!

Jan 8, 2025 - 15:11
 0
ట్రూడో రాజీనామాకు అన్ని కారణాలా?!

ఒట్టావా: కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్​ ట్రూడో అధికారం చేపట్టి ద్రవ్యోల్బణాన్ని, ధరల కట్టడిని చేస్తాడనుకుంటే తీవ్ర వివాదాల్లో చిక్కుకొని రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు’ ట్రూడో రాజీనామా వెనుక కూడా అనేక కారణాలున్నాయి. హర్దిప్​ నిజ్జర్​ హత్య, భారత్​ తో విబేధాలు, ఆర్థిక పరిస్థితులు కట్టడిలో విఫలం, అవినీతి, అక్రమాలు, కుటుంబ సభ్యులకు టెండర్లు కట్టబెట్టడం లాంటివి ఆయన రాజీనామాకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. 

ట్రూడో అధికారం చేపట్టేనాటికే ప్రపంచం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పైగా ఈయన పదవి చేపట్టాక గృహ ఖర్చులు ఏకంగా 30 నుంచి 40 శాతం వరకూ పెరిగాయి. అంతగా పన్నుల భారం మోపారు. మరోవైపు 2017లో హెలికాప్టర్​ ను గిఫ్ట్​ గా అందుకోవడం విమర్శలకు తావిచ్చింది. పైగా కెనడాలోని పెద్ద పెద్ద నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఈయన కుటుంబ సభ్యుల బినామీలకే దక్కాయి. దీంతో ట్రూడో ఆర్థికంగా దేశాన్ని నిలదొక్కబెట్టాలని భారత్ ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలకు ఉపక్రమించారు. ఇందుకు ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్​ హత్య ఆజ్యం పోసింది.

దీంతో భారత్​ తో ట్రూడో పూర్తిగా విబేధిస్తూ పలు ఆరోపణలు, విమర్శలు సంధించి సంబంధ బాంధవ్యాలను పూర్తిగా చెడగొట్టుకున్నారు. ఈ వైఖరిని ఆయన పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించి ఆయనపై అవిశ్వాసం ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర వహించారు. దీంతోపాటు ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయభేరి మోగించిన డోనాల్డ్​ ట్రంప్​ ట్రూడోను ఏనాడు కెనడా ప్రధానిగా గుర్తించలేదు. ట్రంప్​ ప్రకటనల్లో గవర్నర్​ గానే సంబోధించారు. పైగా అమెరికా 51వ రాష్​ర్టం కెనడా అని ట్రూడో ముందే ప్రకటించారు. దీంతో జస్టిన్​ ట్రూడో నవ్వాలో ఏడ్వాలో తెలియక ‘చావుతప్పి కన్నులొట్టపోయినట్లు’గా నవ్వడం మీడియాలో కనిపించింది. ఇక తన పరిపాలన కొనసాగదని పూర్తిగా గ్రహించిన ట్రూడో రాజీనామా చేయక తప్పలేదు. త్వరలోనే కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తన పార్టీ తరఫున ఎవ్వరు ఎన్నికైనా ఆదర్శాలను నిలుపుకోవాలని ట్రూడో తన రాజీనామా సందర్భంగా ప్రకటించడం విశేషం.