ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధం
కేబినెట్ భేటీలో నిర్ణయం? మరో తప్పిదాన్ని పునరావృతం చేయొద్దంటున్న నిపుణులు ఇజ్రాయెల్ దాడికి దిగుతోందన్న బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్
న్యూఢిల్లీ: ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యవసర కేబినెట్ ను సమావేశ పరిచి పలు విషయాలను చర్చించారు. మంగళవారం కూడా కేబినెట్ సమావేశం కొనసాగినప్పటికీ పలువురి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో నేడు కూడా భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మరీ అది ఇరాన్ పై దాడికి సంబంధించా? లేదా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకా? అన్నది వెల్లడికాలేదు. మరోవైపు ఇజ్రయెల్ భారీ దాడికి దిగబోతున్నట్లు బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ అన్నారు. ఇరుదేశాలను సంయమనం పాటించాలని కోరారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజాల మధ్య యుద్ధంలో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒకవేళ ఇజ్రాయెల్ మరో తప్పిదాన్ని పునరావృతం చేస్తే అది ఘోర తప్పిదమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంకోవైపు మరోమారు ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. దీంతో ఇరుదేశాల్లో మరింత ఉద్రిక్తతలకు కారణం అవుతోంది.