రెండో విడతకు సమాయత్తం

13 రాష్ట్రాల్లోని 89 స్థానాల్లో పోలింగ్​ 2, 633 మంది అభ్యర్థులు రంగంలోకి

Apr 24, 2024 - 13:36
 0
రెండో విడతకు సమాయత్తం

నా తెలంగాణ, న్యూఢిల్లీ:  రెండో విడత ఎన్నికలకు ఈసీ చకచకా ఏర్పాట్లు చేస్తుంది. 13 రాష్ట్రాల్లోని 89 పార్లమెంట్​ నియోజకవర్గాలకు ఎన్నికలు శుక్రవారం (ఏప్రిల్​ 26) జరగనున్నాయి. 89 నియోజకవర్గాలకుగాను మొత్తం 2, 633 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా శుక్రవారం (ఏప్రిల్​ 24) సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రచారానికి తెర పడనుంది. 

ఏయే రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయో చూద్దాం.

అసోం: కరీంగంజ్, సిల్చార్, మంగళ్దోయ్, నాగాన్, కలియాబోర్.
బిహార్: కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్​ పూర్​.
చత్తీస్‌గఢ్: రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్.
కర్ణాటక: చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా.
కేరళ: కాసర్‌గోడ్, కన్నూర్, వడకర, వయొనాడ్, కోజికోడ్, మలప్పురం, పొన్నాని, పాలక్కాడ్, అలత్తూర్, త్రిస్సూర్, చాలకుడి, ఎర్నాకులం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజ, మావేలిక్కర, పతనంతిట్ట, కొల్లం, అట్టింగల్, తిరువనంతపురం.
మధ్యప్రదేశ్: టికమ్‌గఢ్, దామోహ్, ఖజురహో, సాత్నా, రేవా, ఔషంగాబాద్, బేతుల్.
మహారాష్ట్ర: బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, యవత్మల్ వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని.
మణిపూర్: ఔటర్ మణిపూర్.
రాజస్థాన్: టోంక్-సవాయి మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్‌పూర్, బర్మేర్, జలోర్, ఉదయపూర్, బన్స్వారా, చిత్తోర్‌గఢ్, రాజ్‌సమంద్, భిల్వారా, కోట, ఝలావర్-బరన్.
త్రిపుర: త్రిపుర తూర్పు.
ఉత్తర ప్రదేశ్:    అమ్రోహా, మీరట్, బాగ్‌పత్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీఘర్, మాథుర్.
పశ్చిమ బెంగాల్: డార్జిలింగ్, రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్.
జమ్మూ కశ్మీర్:    జమ్మూ.