సమస్యల పరిష్కారం దిశగా భారత్
అభివృద్ధి, శాంతి స్థాపనలపైనే మోదీ దృష్టి ఐక్యరాజ్యసమితిలో నీతిఆయోగ్ వైస్ చైర్మన్ బెర్రీ హర్షం
నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సమస్యల పరిష్కారం, ప్రజా సేవ దిశగా చేస్తున్న కృషిని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ హర్షం వ్యక్తం చేశారు. జూలై 8 నుంచి జూలై 17 వరకు ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ సమస్యల పరిష్కారం దిశగా భారత చేస్తున్న కృషి, విధానాల అమలుపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బెర్రీ మీడియాకు గురువారం పలు వివరాలను అందజేశారు డిజిటలైజేషన్, సుస్థిర అభివృద్ధి, అట్టడుగు వర్గాలను ఆర్థికంగా పరిపుష్ఠం చేసే చర్యలను ఆయన వివరించారు. 21వ శతాబ్ధంలో నాగరిక జీవితానికి నిబద్ధతకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2047 నాటికి మోదీ విజన్ స్పష్టంగా ఉందని తెలిపారు. రాబోయే 25యేళ్లలో జరగబోయే అభివృద్ధి, శాంతి సుస్థిర స్థాపనపైనే భారత్ దృష్టి ఉండనున్నట్లు పేర్కొన్నారు.