చైనా చైన్​ ను విరగ్గొట్టిన భారత్​

డ్రాగన్​ కంట్రీకి యూఎస్​ ఎ సంస్థల బైబై

Jan 26, 2025 - 15:25
 0
చైనా చైన్​ ను విరగ్గొట్టిన భారత్​

ఉపద్రవాలే కారణం
విపత్తులు, ఆర్థిక నష్టాలతో సంస్థల నిర్ణయం
చిన్నదేశాలతో కటీఫ్​ డ్రాగన్​ మెడపై కత్తి
ట్రంప్​ నిర్ణయాలను నమ్మలేమంటున్న విశ్లేషకులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: అమెరికా సంస్థలు చైనా నుంచి శరవేగంగా తప్పుకుంటున్నాయి. తొలిసారి కరోనా నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు, నష్టాలను ఎదుర్కొన్న చైనాలోని వివిధ దేశాల సంస్థలు ఇటీవలే చైనా నుంచి వ్యాపించిన మరో వైరస్​ కూడా కారణంగా కనిపిస్తుంది. అదే సమయంలో అమెరికా దేశీయంగానే పలు ఉత్పత్తులను రూపొందిస్తుండడం కూడా వైదొలగుతున్న సంస్థలకు అవకాశాలు కల్పించినట్లవుతుంది. 

కరోనాతో యూటర్న్​..
మరోవైపు ఈ పరిణామా భారత్​ కు ఒకేసారి గాకుండా నిదానంగానైనా కలిసి వస్తుంది. మైక్రో చిప్​ ల తయారీలో ఇప్పటికే భారత్​ అడుగు పెట్టి చైనా చైన్​ ను విరగ్గొట్టి, అమెరికాకు ప్రధాన సరఫరాదారుగా నిలిచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఆరంభించింది. 2024లో 30 శాతం అమెరికన్​ సంస్థలు చైనా నుంచి ఉత్పత్తిని సాధిస్తున్నాయి. అయితే 70 శాతం వెనుకంజ వేశాయి. అసోచామ్​ నివేదిక ప్రకారం 2017లో చైనాలో విస్తరించాలని అమెరికన్​ సంస్థలు భావించాయి. కానీ కరోనా ఉపద్రవం తరువాత సంస్థలు వెనుకడుగు వేశాయి. 

సంస్థలకు గమ్యస్థానం భారత్​..
కొత్త ట్రెండ్​ వల్ల భారత్​ అత్యధికంగా లాభం పొందే అవకాశం ఉన్నట్లు అసోచామ్​ తన నివేదికలో వెల్లడించింది. చైనా నుంచి బయటకు వస్తున్న ఆసియా దేశాల సంస్థలో ప్రసిద్ధ గమ్యస్థానం భారత్​ గా నిర్ణయించాయి. అమెరికా–చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల సంస్థలకు నష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే చైనా రియల్​ ఎస్టేట్​ సంస్థలు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మరోవైపు బంగ్లా, పాక్​ తో దోస్తీ, జపాన్​, తైవాన్​ లాంటి చిన్న దేశాల సముద్ర జలాలను ఆక్రమించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చైనా చర్యలను తప్పుపట్టే దేశాల సంఖ్య క్రమేణా భారీగా పెరిగింది. దీంతో ఆయా సంస్థలకు ఇది ప్రతిబంధకంగా మారి చైనాలో సంస్థల స్థాపన, ఉత్పత్తి అంటేనే జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

చైనాకు బైడెన్​ టాటా.. ట్రంప్​?..
ఇక అంతిమంగా జో బైడెన్​ ప్రభుత్వం చైనా వ్యవహార శైలితో అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. నూతనంగా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్​ దుందుడుకు నిర్ణయాలు కూడా ప్రస్తుతానికి చైనాకు పరోక్షంగానే ఉన్నా అధ్యక్షుడి నిర్ణయాలు ఏ క్షణం ఎటువైపు మళ్లుతాయో అనే టెన్షన్​ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని మోదీ నేతృత్వంలోని విదేశాంగ విధానం మరింత పటిష్ఠంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఏది ఏమైనా భారత్​ సాధిస్తున్న వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా పటిష్ఠం అయ్యేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 బడ్జెట్​ లో గట్టి చర్యలు, కేటాయింపులు తీసుకుంటే భారత్​ ఆర్థిక వృద్ధి మరింత పటిష్ఠం కావడం ఖాయమేనని చెబుతున్నారు.