బంగ్లాకు సహాయం నిలిపివేత

ఎగ్జిక్యూటీవ్​ ఉత్తర్వులు జారీ చేసిన డోనాల్డ్​ ట్రంప్​

Jan 26, 2025 - 15:58
 0
బంగ్లాకు సహాయం నిలిపివేత

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ బంగ్లా కష్టాలను మరింత పెంచారు. ఆ దేశానికి అమెరికా అందే అన్ని రకాల సహాయం తక్షణమే నిలిపివేయాలని ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​ నిషేధ ఉత్తర్వులను ఆదివారం జారీ చేశారు. దీంతో అమెరికా ద్వారా సహాయం పొందుతున్న అన్ని రకాల సహాయాలు, ప్రాజెక్టులు నిలిచిపోనున్నాయి. దీంతో బంగ్లాదేశ్​ మరింత ఆర్థిక అగాధంలోకి కూరుకుపోక తప్పదు. గ్రాంట్లు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, ఆర్థిక, వస్తు రూపంలో సహాయాలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి. ట్రంప్​ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జై శంకర్​ కూడా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో బంగ్లాదేశ్​ లో హిందువులు, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై వివరించారు. బంగ్లాదేశ్​ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇది ప్రజాస్వామ్యానికే ముప్పని తన నిరసనను ట్రంప్​ కు తెలిపారు. జై శంకర్​ చర్చల వల్లే ట్రంప్​ బంగ్లాపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లుగా భావిస్తున్నారు.