అందరికీ అభివృద్ధి ఫలాలు 

పార్లమెంట్​ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ

Jan 31, 2025 - 13:53
 0
అందరికీ అభివృద్ధి ఫలాలు 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత దేశ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించడమే లక్ష్యమని, వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​ కు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. శుక్రవారం పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశిస్తూ  ప్రసంగం చేశారు. తొలుత ఉభయ సభలు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ కు, కుంభమేళాలోని తొక్కిసలాటలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. 

అనంతరం ప్రారంభ ప్రసంగాన్ని చేశారు. రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యతనిస్తామన్నారు. మూడోసారి మూడు రెట్ల వేగంతో పనిచేస్తామన్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే తమ లక్ష్యమన్నారు. 3 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించనున్నామని తెలిపారు. ఇళ్లపై సబ్సిడీ ఋణాలు, 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించడం, రూ. 70 వేల కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే భారత్​ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నారు. 

70ఏళ్లు దాటిన ఆరుకోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నామన్నారు. యువత ఉద్యోగాలు, అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. మహిళలు భారత శక్తిని చాటుతున్నారని తెలిపారు. విద్య రంగం, సాంకేతికత, రీసెర్చ్​, ఆటలు వంటి రంగాల్లో భారత్​ దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. అదే సమయంలో వ్యాపార, వాణిజ్య రంగాల కోసం క్రెడిట్​ గ్యారంటీ స్కీమ్​ తీసుకొచ్చామని తెలిపారు. విమాన రంగం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. 

పొలవరంకు రూ. 12 వేల ఖర్చు, సైబర్​ సెక్యూరిటీకి డీప్​ ఫేక్​ లు పెనుముప్పుగా మారాయన్నారు. దళితులు, వెనకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో 30 వైద్య కళాశాలలు ప్రారంభించామన్నారు. అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్లు అందుబాటులోకి తెచ్చామని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, క్యాన్సర్‌ కేసుల దృష్ట్యా ఔషధాలపై కస్టమ్స్‌ సుంకం తగ్గించామని తెలిపారు. 

అన్ని రంగాల్లో అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తెలిపారు.